ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంటు స్థంభాన్ని ఢీకొన్న కారు.. భారీగా గంజాయి లభ్యం - కరెంటు స్థంభాన్ని ఢీకొన్న కారు-భారీగా గంజాయి లభ్యం

లారీని తప్పించబోయిన ఓ కారు కరెంటు స్థంభాన్ని ఢీకొట్టి రహదారి విభాగినిని ఎక్కింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడంతో అక్కడే వదిలి వెళ్లారు. పోలీసులు పరిశీలించగా ఆ కారులో భారీ మొత్తంలో గంజాయి ఉండడంతో అవాక్కయ్యారు.

Car collision with power pole--heavy marijuana identified
కరెంటు స్థంభాన్ని ఢీకొన్న కారు-భారీగా గంజాయి లభ్యం

By

Published : Oct 14, 2020, 12:16 PM IST

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున లారీని తప్పించబోయి ఇన్నోవా కారు డివైడర్ వద్ద ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పైకి ఎక్కింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని వెళ్లడానికి వీలులేకపోవడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు దాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా కారులో పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది. కారు ఏలూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తూ ప్రమాదానికి గురవడంతో పోలీసులు కారులో ఎంత మంది ఉన్నారు,ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారు అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details