Car Caught Fire on the Road: గత కొద్ది రోజులుగా తరచూ వాహనాల నుంచి మంటలు చెలరేగుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. వాహనాల నిర్మాణంలో నాణ్యతాలోపమో లేక.. డ్రైవర్ల నిర్లక్ష్యమో తెలియదుగానీ వరుస ఘటనలతో కారులో ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి ఘటనే గుడివాడలో చోటు చేసుకుంది.
గుడివాడ దగ్గర కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సురక్షితం - gudivada local news
Car Caught Fire on the Road: రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్లుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు ఇంజన్లో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. డ్రైవర్ ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇంజన్ నుంచి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

కైకలూరు నుంచి విజయవాడ వస్తున్న కారులో నుంచి గుడివాడ వద్దకు రాగానే పోగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవరు.. కారును రోడ్డు పక్కకు ఆపాడు. ఏం జరుగుతుందోనని పరీక్షించే లోపే ఆ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి