కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లు శివారులో కారు ద్విచక్ర వాహనాన్నీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు నందిగామ ప్రాంతానికి చెందిన ప్రకాష్ గా గుర్తించారు. గాయపడ్డవారిని వెంటనే చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - నందిగామ వార్తలు
కృష్ణా జిల్లా నందిగామలో కారు-ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరిరి తీవ్ర గాయాలయ్యాయి.
కారు ద్విచక్ర వాహనాం ఢీ.. ఒకరు మృతి