ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..తల్లి, కుమారుడు మృతి - కరకట్టపై కారు అదుపుతప్పిన కారు

చోడవరం కరకట్టపై కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు. తండ్రి, మరో కుమారుడు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.

car accident
car accident

By

Published : Aug 4, 2020, 11:00 AM IST

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం పరిధిలో కరకట్టపై ప్రమాదం జరిగింది. కరకట్టపై కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తుండగా.. తల్లి మహాలక్ష్మి(33), కుమారుడు మహంతి(5) మృతి చెందారు. భర్త కిరణ్​ కుమార్​, మరో కుమారుడు(11 నెలలు) ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా అవగనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా పెనుమాక వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక సీఐ సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. యంత్రం సహాయంతో కారును కాల్వ నుండి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు కాలువలోకి దూసుకెళ్లింది. కళ్ల ముందే భార్య, కుమారుడు మృతి చెందడంతో ఆ తండ్రి , మరో కుమారుడు విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details