కరోనా భయంతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా కృష్ణా జిల్లా వెంకటపాలెం రైతులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రాజధాని అమరావతి కోసం నిరసనను కొనసాగిస్తున్నారు. శిబిరాల్లో కొంతమంది కూర్చుని దీక్ష చేస్తున్నారు. మరి కొంతమంది ఇంటి నుంచే జెండాలను పట్టుకుని దీక్ష చేస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైన ఆందోళనను ఆపేది లేదని ముక్తకంఠంగా చెబుతున్నారు.
'కరోనాతో జాగ్రత్తలు పాటిస్తాం... అమరావతిని సాధిస్తాం' - protest on amaravathi
రాజధాని అమరావతి కోసం కృష్ణా జిల్లా వెంకటపాలెంలోని రైతుల చేపట్టిన దీక్ష 97వ రోజుకు చేరుకుంది. కరోనా ప్రభావంతో రైతులు కొంతమంది మాత్రమే శిబిరాల వద్దకు వచ్చి దీక్ష చేపడుతున్నారు. మరికొంతమంది ఇంటి నుంచే తమ నిరసనను తెలుపుతున్నారు.
'కరోనాతో జాగ్రత్తలు పాటిస్తాం... అమరావతిని సాధిస్తాం'
ఇవీ చదవండి