ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనతా కర్ఫ్యూని పాటిస్తూనే ఉద్యమాన్ని కొనసాగిస్తాం' - ఏపీలో అమరావతి వార్తలు

కరోనా విషయంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటిస్తూనే ఆందోళన కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.

'జనతా కర్ఫ్యూని పాటిస్తునే ఉద్యమాన్ని కొనసాగిస్తాం'
'జనతా కర్ఫ్యూని పాటిస్తునే ఉద్యమాన్ని కొనసాగిస్తాం'

By

Published : Mar 21, 2020, 8:40 PM IST

మందడంలో రైతుల ఆందోళన

రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన 95వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను రైతులు పాటిస్తామన్నారు. తమ నిరనసను గౌరవించి మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మందడంలో రైతులు మూడు మీట్లర్ల దూరంలో కూర్చుని నిరసన చేపపట్టారు. ముఖానికి మాస్కులు ధరించి ఆందోళన చేశారు.

వెలగపూడిలో ఆందోళన

వెలగపూడి

ప్రధాని సూచన మేరకు జనతా కర్ఫ్యూని పాటిస్తామని రైతులు స్పష్టం చేశారు. రేపు రాత్రి అమరావతి వెలుగు పేరిట అందరి ఇళ్లలోను లైట్లు ఆపి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతామన్నారు.

మందడం

ముఖ్యమంత్రి జగన్​కు తమ మీద ఇంకా పగ చల్లారనట్లు వ్యవహరిస్తున్నారని మందడం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులైనా తమ హక్కుల కోసం పోరాడటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రాయపూడిలో ఆందోళన

రాయపూడి

అమరావతి కోసం ఇప్పటి వరకూ 50మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని రాయపూడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందరి చావు కోరతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్కటే రాజధాని ప్రకటన ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి

'ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలి'

ABOUT THE AUTHOR

...view details