ప్రభుత్వమే ఒప్పందాలు ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము భూములిచ్చింది రాష్ట్ర ప్రజల కోసమే తప్ప వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు. తమతో కుదిరిన ఒప్పందానికి వ్యతిరేకంగా ముందుకెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. 93వ రోజు చిన్నాపెద్దా అందరు కలిసి అమరావతి కోసం ఆందోళన కొనసాగించారు. పేదలకు ఇళ్లస్థలాల పేరుతో రాజధాని భూముల పంపిణీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
'వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం భూములివ్వలేదు' - ap capital news
రాజధాని భూములను ఇతర జిల్లాలోని పేదలకు పంపిణీ చేయడాన్ని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆపాలని సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
!['వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం భూములివ్వలేదు' సీఆర్డీఏ కమిషనర్‌కు రాజధాని ప్రాంత రైతుల వినతిపత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6466813-96-6466813-1584617720195.jpg)
సీఆర్డీఏ కమిషనర్‌కు రాజధాని ప్రాంత రైతుల వినతిపత్రం
Last Updated : Mar 19, 2020, 6:20 PM IST