మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడలో 10వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి దేవినేని అపర్ణ తరఫున ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని కేశినేని ప్రారంభించారు.
నందిగామ పదో వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మండవ కృష్ణకుమారి విజయాన్ని కాంక్షిస్తూ రైతు పేటలో అభ్యర్థినితో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారంలో పాల్గొన్నారు.