ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ లాక్​డౌన్ : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌ తప్పనిసరి

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది (Lockdown Extension). అయితే పది రోజల పాటు రాష్ట్రంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మంత్రివర్గ నిర్ణయం(cabinet) మేరకు వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు లాక్‌డౌన్​ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌(e-pass) తప్పనిసరి చేసిన సర్కార్​.. అంతర్‌రాష్ట్ర బసు సర్వీసులను రద్దు (interstate bus services) చేసింది.

తెలంగాణ లాక్​డౌన్ : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌ తప్పనిసరి
తెలంగాణ లాక్​డౌన్ : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్‌ తప్పనిసరి

By

Published : May 31, 2021, 4:45 AM IST

లాక్‌డౌన్​ను మరో 10 రోజుల పాటు పొడిగించాలన్న మంత్రివర్గ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 విపత్తు నిర్వహణా చట్టానికి(disaster management act) లోబడి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జూన్‌ 9 వరకు లాక్‌డౌన్​ విధించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు పూర్తి లాక్‌డౌన్ ఉంటుందన్న సర్కార్.. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సడలింపులు ఉంటాయని... అయితే కార్యాలయాలు, దుకాణాలన్నింటినీ ఒంటి గంట వరకే మూసివేయాలని స్పష్టం చేసింది.

అంతర్‌ రాష్ట్ర బసు సర్వీసులకు అనుమతి లేదు..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఈ-పాసులు ఉంటేనే అనుమతి ఉంటుందని.. సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. సడలింపుల సమయంలో అన్ని రకాల ప్రజారవాణాకు(public transport) అనుమతి ఉంటుందని, ప్రైవేట్ ఆపరేటర్లు సహా అంతర్‌ రాష్ట్ర బసు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది.

పూర్తి వేతనాలు ఇవ్వాల్సిందే : సర్కార్

ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, దుకాణాలు ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలన్న ప్రభుత్వం.. ఈ విషయంలో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మత, క్రీడా, సాంస్కృతిక, వినోద పరమైన ర్యాలీలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుందన్న ప్రభుత్వం.. పెళ్లిలకు గరిష్టంగా 40 మందికి, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది.

అక్కడి పెట్రోల్ బంకులకే 24 గంటల గ్రీన్ సిగ్నల్..

వైద్య-ఆరోగ్య, వ్యవసాయ, అనుబంధ, నిత్యావసర, ఈ-కామర్స్, తయారీ, పారిశుధ్య, ఉపాధిహామీ, సైట్​లోనే నిర్మాణ పనులకు లాక్‌డౌన్​ నుంచి మినహాయింపు ఇచ్చింది. జాతీయ రహదారులు మినహా మిగతా ప్రాంతాల్లోని పెట్రోల్ పంపులు మధ్యాహ్నం ఒంటి గంట వరకే పనిచేయాలని స్పష్టం చేసింది.

ఆ ఆఫీసుల్లో పూర్తి స్థాయి విధులు..

రాష్ట్ర ప్రభుత్వంలోని వైద్య-ఆరోగ్య, పోలీసు, స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, నీటిసరఫరా, పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవసాయ, అనుబంధ, పౌరసరఫరాల శాఖలతో పాటు కొవిడ్ విధుల్లో ఉన్న కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయని తెలిపింది. మిగతా శాఖల కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం మంది సిబ్బందితో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తాయని వివరించింది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలే : తెలంగాణ సర్కార్

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం లాంటి కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని.. హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన వారంతా ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇవీ చూడండి :lockdown in Telangana: తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

Anandayya Medicine : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details