ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలూ... గుండీల బుట్ట తయారు చేద్దామా..! - బెలూన్లు

చిన్నారులూ.. బెలూన్లు ఊదితే భలే సరదాగా ఉంటుంది కదా! అదే బెలూన్లతో చిన్న బుట్ట తయారు చేయొచ్చు తెలుసా. అదేంటో.. ఎలా తయారు చేయాలో మీరూ తెలుసుకోండి మరి.

బెలూన్లతో చిన్న బుట్ట
బెలూన్లతో చిన్న బుట్ట

By

Published : Mar 29, 2020, 6:34 PM IST

గుండీల బుట్ట

తయరూ చేయాల్సిన విధానం

⦁ ముందుగా బెలూన్ తీసుకుని గాలి ఊదాలి

⦁ దాని మొదలు దారంతో ముడి వేయాలి

⦁ ఇప్పుడు చిత్రంలో చూపించినట్లు బెలూన్​ని డబ్బాలో పెట్టాలి.

⦁ ఇప్పుడు నెమ్మదిగా బెలూన్ పై భాగం గమ్ రాయాలి.

⦁ ఈ పని చేస్తున్నప్పుడు బుగ్గ పగలకుండా చూసుకోవాలి.

⦁ ఎందుకంటే గమ్ మీద పడే అవకాశం ఉంది.

⦁ కష్టంగా అనిపిస్తే పెద్దవాళ్ల సహాయం తీసుకోండి.

⦁ తర్వాత ఇంట్లో ఉన్న పాత గుండీలు ఒక్కోటి అతికించండి.

⦁ ఇలా చేసేప్పుడు గుండీలన్నీ దగ్గరగా ఒకదానికొకటి తాకేలా చూసుకోవాలి.

⦁ ఇప్పుడు ఓ 3,4 గంటలు ఆరనివ్వండి.

⦁ పూర్తిగా ఆరిన తర్వాత బుగ్గలోని గాలి నెమ్మదిగా తీసేయాలి.

⦁ ఇంకేం... గుండీల బుట్ట సిద్ధం.

ఇప్పుడు దీన్ని మీ స్టడీ రూంలో పెట్టుకుని స్లేట్, పెన్సిళ్లు, పెన్నులు, ఇరేజర్లు, షార్పునర్లు.. ఇలా మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు.

ఇదీ చూడండీ:

సబ్బు నిజంగానే వైరస్​ను నాశనం చేస్తుందా?

ABOUT THE AUTHOR

...view details