కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల వద్ద పంట బోధిలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. గుడివాడ నుంచి విజయవాడ వస్తుండగా బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మంది ఉన్నట్లు సమాచారం. పదిమందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన అనంతరం స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. రోడ్లు సక్రమంగా లేకపోవటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు.
పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పదిమందికి తీవ్ర గాయాలు - కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం కలవపాముల వద్ద ప్రమాదవశాత్తూ పంటబోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
bus accident
Last Updated : Jun 29, 2022, 1:24 PM IST