కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం వద్ద కరకట్టపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో క్షతగాత్రులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్తున్న ఆర్టీసీ బస్సు... అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. 108కి సమాచారం అందటంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ వేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
కృష్ణాజిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా..20మందికి గాయాలు
పెనమలూరు మండలం చోడవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. పలువురికి గాయాలు కావటంతో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
'చోడవరంలో ఆర్టీసీ బస్సు బోల్తా'
బస్సు బోల్తా ఘటనపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు.
ఇది చూడండి: 'మహిళ కాలుపై ఎక్కిన బస్సు..తీవ్రగాయాలు'
Last Updated : Aug 31, 2019, 11:21 PM IST