కాకినాడ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీస్ రోడ్డు వద్దకు రాగానే బస్సు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టంతో బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 20మందికి గాయాలు కాగా...ఒక ప్రయాణికుడి చెయ్యి తెగిపోయింది. సంఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బోల్తాపడ్డ బస్సును అక్కడినుంచి తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
విజయవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా...20మందికి గాయాలు - విజయవాడలో ప్రైవేట్ బస్సు బోల్తా
కాకినాడ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులకు గాయాలపాలవ్వగా...ఒకరి చెయ్యి తెగిపోయింది.
విజయవాడలో బస్సు బోల్తా...20మందికి గాయాలు