ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదఘాతంతో దగ్ధమైన ఇల్లు.. మరో ఘటనలో బూడిదైన గడ్డివాము - విద్యుదఘాతంతో దగ్ధమైన ఇళ్లు, గడ్డివాము

కృష్ణా జిల్లాలో 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. పెదకళ్లేపల్లి గ్రామంలో విద్యుదఘాతంతో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో 3 ఎకరాల గడ్డివాము బూడిదైంది. ఈ ప్రమాదాల్లో సుమారు రూ.95 మేర ఆస్థినష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

fire accident in Krishna district
విద్యుదఘాతంతో దగ్ధమైన ఇళ్లు, గడ్డివాము

By

Published : Jan 9, 2021, 9:15 AM IST

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన దోనే బాబురావు ఇంట్లో... విద్యుదాఘాతంతో మంటలు అంటుకున్నాయి. సుమారు రూ.80 వేల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ అధికారి ప్రాథమికంగా పేర్కొన్నారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం మంటల్లో బూడిదైందంటూ.. బాధితులు ఆవేదన చెందారు.

మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో జరిగిన విద్యుదాఘాతంతో బొల్లిముంత శ్రీనివాసరావుకు చెందిన 3 ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.15 వేలు నష్టం జరిగిందని అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది బాలమురళి కృష్ణ ప్రాథమికంగా అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details