Bulls Race in Gopavaram: కృష్ణాజిల్లా కైకలూరు మండలం గోపవరం గ్రామంలో దీపక్ నెక్స్జెన్ వారి ఆధ్వర్యంలో ఎడ్ల పందేలు సందడిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 50 ఎడ్ల జతలు ఈ పోటీలకు తరలివచ్చాయి. పందేలను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
Bulls Race in Gopavaram: గోపవరంలో సందడిగా ఎడ్ల పందేలు.. భారీగా తరలివచ్చిన జనం - Bulls Race in Krishna District
Bulls Race in Gopavaram: కృష్ణా జిల్లా గోపవరంలో ఎడ్ల పందేలు కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 50 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
Bulls Race in Gopavaram
ఎడ్ల పందేలతో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా ఎడ్లు తరలిరావడం మరింత ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.