ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పనైనా చూపండి... పరిహారమైనా చెల్లించండి' - gannavaram

గన్నవరం తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధిని కల్పించాలని.. 4 మాసాల తమ ఆకలి బాధకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

building workers dharna at gannavaram

By

Published : Sep 30, 2019, 6:22 PM IST

పనైనా చూపండి... పరిహారమన్నా చెల్లించండి

కృష్ణా జిల్లా గన్నవరం తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణం వద్ద భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పని దినాలలో నష్టపోయిన కార్మికులకు ప్రభుత్వం 10 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 4 మాసాల తమ ఆకలి బాధకు భృతి ఇవ్వాలని... ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కల్పించాలని భవన నిర్మాణ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details