విజయవాడ నగర శివారు గొల్లపూడి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట భవన యజమానులు ఆందోళన చేపట్టారు. 11 నెలలుగా అద్దె చెల్లించకుండా కార్యాలయాన్ని మంగళగిరి తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వ అధికారులు, సంబంధిత మంత్రి స్పందించాలని భవన యజమానులు డిమాండ్ చేశారు.
అద్దెలు చెల్లించలేదని భవన యాజమానుల ఆందోళన - విజయవాడలో అద్దె చెల్లించాలని భవన యాజమానులు నిరసన
ఏడాది అవుతున్న అధికారులు ఇంత వరకు భవనాలకు అద్దెలు చెల్లించలేదని విజయవాడ శివారులోని గొల్లపూడి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట యాజమానులు ఆందోళన చేశారు. సంబంధింత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో భవన యాజమానులు ఆందోళన