కృష్ణా జిల్లా గుడివాడలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం నుంచి పురపాలక సంఘ కార్యాలయం వరకు 'కావాలి ఇసుక... రావాలి ఇసుక' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రెండు నెలలుగా ఇసుక కొరతతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని.. వెంటనే ప్రభుత్వం ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
గుడివాడలో భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ - vijayawada
ఇసుక కొరత తీర్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని... భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ