ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి' - నందిగామలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా తాజా న్యూస్

కృష్ణా జిల్లా నందిగామలో సీఐటీయు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మిక కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు.

నందిగామలో దీక్ష చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు
నందిగామలో దీక్ష చేపట్టిన భవన నిర్మాణ కార్మికులు

By

Published : Apr 27, 2020, 11:37 PM IST

కృష్ణా జిల్లా నందిగామ సీఐటీయు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు దీక్ష చేపట్టారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం తక్షణమే రూ.10,000 ఆర్థిక సాయం అందించాలని సీఐటీయు నేత కటారపు గోపాల్ డిమాండ్‌ చేశారు. ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం, 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. అప్పుడు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోతే.. ఇప్పుడు కరోనాతో పూట గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను వారి స్వగ్రామాలకు చేర్చాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details