ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుట్రలో భాగమే బిల్డ్ ఏపీ పథకం' - బిల్డ్ ఏపీ పథకం వార్తలు

దోపిడీలో భాగమే బిల్డ్ ఏపీ పథకం అని తెదేపా నేత నక్కా ఆనంద బాబు ఆరోపించారు. ఇప్పటికే ఇసుక, మద్యం లాంటి వాటిపై వైకాపా ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందన్నారు. నచ్చిన వ్యక్తులకు భూములు కట్టబెట్టే కుట్రలో భాగమే ఈ బిల్డ్ ఏపీ పథకమన్నారు.

build ap scheme in ap
build ap scheme in ap

By

Published : May 14, 2020, 2:56 PM IST

వైకాపా ప్రభుత్వం మరో భారీ దోపిడీలో భాగమే.. బిల్డ్ ఏపీ పథకం అని మాజీ మంత్రి నక్కా ఆనంద‌బాబు ఆరోపించారు. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంటే.. సీఎం జగన్ మాత్రం దోపిడీకి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కరోనాను అడ్డుపెట్టుకుని చీకటి మాటున ప్రతి అంశంలోనూ దోపిడీకి తెర తీస్తున్నారని అన్నారు.

ఇప్పటికే ఇసుక, మద్యం, ఇతర ఖనిజాలు.. ఇలా వివిధ రకాల దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహించారు. నచ్చిన వ్యక్తులకు భూములు కట్టబెట్టే కుట్రలో భాగమే ఈ బిల్డ్ ఏపీ పథకమని అన్నారు. రాష్ట్రాన్ని నిర్మిస్తామనే పేరుతో అమ్మకం ఎలా చేపడతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలని నక్కా ఆనందబాబు హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details