కృష్ణాజిల్లా అవనిగడ్డలో డ్రైనేజి పై మేత మేస్తూ ఉండగా డ్రైన్ పైన వేసిన సిమెంట్ బల్లలు విరిగిపోగాయి. దీంతో పదిఅడుగుల లోతుగల డ్రైన్ లో పడిపోయి ఇరుక్కు పోయింది. గేద చూడిది కావడంతో కదలలేక పోయింది. స్థానికులు వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి వారి సాయంతో డ్రైన్ పక్కన తవ్వి మోకు సాయంతో గేదెను పైకిలాగి రక్షించినట్లు అవనిగడ్డ అగ్నిమాపక అధికారి వి. అమరేశ్వరరావు తెలిపారు.
మురుగు కాలువలో పడిపోయిన చూడి గేదె-రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
కృష్ణాజిల్లా అవనిగడ్డలో డ్రైనేజి పై మేత మేస్తూ ప్రమాదవశాత్తు పదిఅడుగుల లోతుగల డ్రైన్ లో పడిపోయి ఇరుక్కు పోయింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి గేదెను బయటకు తీసి రక్షించారు.
మురుగు కాలువలో పడిపోయిన చూడి గేదె-రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
లక్ష రూపాయలు విలువ గల గేదెను రక్షించిన వారికి దాని యజమానురాలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: ఆవు కష్టం తీర్చిన ఆటోడ్రైవర్