సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిని విమర్శిస్తే తన అంతు చూస్తామని కొందరు ఆగంతుకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరిస్తున్నారంటూ ఓ లేఖను విడుదల చేశారు. ఇటీవలే మాచర్లలో తనపై హత్యాయత్నం చేశారన్న బుద్ధా... తాజా బెదిరింపులు ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు తట్టుకోలేని వారే వ్యక్తిగత బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు జరిగి, తప్పులు సరిదిద్దుకోవటానికి ప్రతిపక్షంగా విమర్శిస్తామని... వైకాపా నేతలు నిగ్రహం కోల్పోయి ప్రజల్లో అబాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుని ఏమైనా అనొచ్చు కానీ తాము విమర్శిస్తే మాత్రం వైకాపా నాయకుల తట్టుకోలేరా అని ప్రశ్నించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని లేఖలో పేర్కొన్నారు.
'బెదిరింపులు ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే' - బుద్ధా వెంకన్న
ముఖ్యమంత్రి, విజయసాయిరెడ్డిని విమర్శిస్తే , కొందరు ఆగంతుకులు బెదిరిస్తున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆరోపిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు తట్టుకోలేని వారే వ్యక్తిగత బెదిరింపులకు దిగుతున్నారన్నారు.

బుద్ధా వెంకన్న