ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైసీపీ నావను విజయసాయిరెడ్డి ముంచేస్తారు' - chandra babu

విజయసాయిరెడ్డి... జగన్​కు శకునిలా తయారయ్యారు. ప్రధాని కార్యాలయంలోకి వెళ్లాలంటే మంత్రులకు, ఎంపీలకు అనుమతి ఉండాలి. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం అవేమీ అవసరం లేకుండా ఎప్పడైనా వెళ్లగలరు. ఎందుకంటే ఆయన మోదీ భక్తుడు: బుద్దా వెంకన్న

బుద్దా వెంకన్న

By

Published : Apr 28, 2019, 6:46 PM IST

బుద్దా వెంకన్న మీడియా సమావేశం

మే 23న వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిపై బుద్దా విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డికి చంద్రబాబు నామస్మరణ చేయనిదే రోజు గడవదన్నారు. ఆయనలాంటి వ్యక్తి రాజ్యసభ సభ్యులుగా ఉండడానికి అనర్హులన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి సూచనలు, సలహాలతోనే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ జైలుపాలయ్యారని విమర్శించారు. జగన్ అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఎస్ నిందితుడని.. ఇప్పుడు ఆయన భాజపా దర్శకత్వంలో వైకాపాకు అనకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత జగన్, విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలుకు వెళ్తారని... వైకాపా కనుమరుగవుతుందని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్‌కు విజయసాయిరెడ్డి శకునిలా తయారయ్యారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details