కులం పేరుతో సీఎం జగన్ రాజకీయాలు చేయడం మానుకోవాలని తెదేపా నేత బుచ్చి రాంప్రసాద్ హితవు పలికారు. ప్రమాదాలకు కులం ఆపాదించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదన్నారు. అధికారంలోకి రావడం కోసం చిచ్చు పెట్టి, వచ్చాక వర్గాల వారీగా ప్రజల్ని విభజిస్తున్నారని దుయ్యబట్టారు.