కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మంకోల్లు జలాశయం సమీపంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరిందని, పటిష్టమైన ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 1975లో నాటి అవసరాలకు అనుగుణంగా కేవలం ఎడ్ల బళ్ళు, చిన్నపాటి వాహనాలు రాకపోకలకు వెసులుబాటుగా నిర్మించారని స్థానికులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహానికి 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా శిథిలం కావడంతో, ఇటీవల ఒక వ్యక్తి వంతెనపై నుండి జారిపడి మృత్యువాత పడినట్లు తెలిపారు.రోజూవారీ పనుల నిమిత్తం ఈ వంతెన మీద వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగుతాయంటున్నారు. ఇటుగా ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటంగా మారిందని వాపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు పటిష్టమైన ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వంతెన శిథిలావస్థకు చేరింది పటిష్ట వారథి నిర్మించరూ.. - వంతెన శిథిలావస్థకు చేరింది…పటిష్ట వారథి నిర్మించరూ..
ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది.. అటుగా ప్రయాణించాలంటే ప్రాణాలకు ముప్పేనంటున్నారు ఆ గ్రామ ప్రజలు. పటిష్టమైన ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.
![వంతెన శిథిలావస్థకు చేరింది పటిష్ట వారథి నిర్మించరూ.. bridge is in a state of disrepair..please construct new one strongly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9180014-474-9180014-1602739489042.jpg)
వంతెన శిథిలావస్థకు చేరింది…పటిష్ట వారథి నిర్మించరూ..