BRIDGE: ఇటీవలే పూర్తయిన.. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో డొల్లతనం బయటపడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సన్నపాలెం వద్ద పైవంతెన స్వలంగా కూలింది. ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెలు నేలకొరిగాయి. సర్వీస్ రోడ్డులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెన్నై-కోల్‌కతా జాతీయరహదారి పరిధిలో.. కృష్ణా జిల్లా చిన్నఅవుటపల్లి, పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను మధ్య విస్తరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఇంతలోనే కృష్ణా జిల్లా శేరినర్సన్నపాలెం వద్ద వంతెన కూలిపోవడం.. పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. వంతెన నిర్మాణానికి వాడిన మట్టి కిందకు జారి.. ప్రమాదకరంగా మారింది. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు కొద్దిసేపటి వరకూ నిలిపివేశారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ.. వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
రహదారి విస్తరణ పనుల్లో డొల్లతనం.. స్వల్పంగా కూలిన పైవంతెన - కృష్ణా జిల్లా తాజా వార్తలు
Bridge Collapsed: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం శేరినర్సన్నపాలెం వద్ద పైవంతెన స్వలంగా కూలింది. వంతెన నిర్మాణానికి వాడిన మట్టి కిందకు జారి.. ప్రమాదకరంగా మారింది. సర్వీస్ రోడ్డులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
BRIDGE