కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి-కూచిపూడి గ్రామాల మధ్య వంతెన కూలిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో ఓ లారీ అధిక లోడుతో వెళ్తూ వంతెన దిమ్మలను ఢీకొని పక్కకు పడిపోయింది. ఈమధ్య కాలంలో వర్షాలకు వంతెనకు మూడు మీటర్ల రంధ్రం ఏర్పడటంతో అధికారులు వంతెనను కూల్చివేశారు. దీంతో వాహనదారులు పామర్రు మీదుగా తిరిగి వెళ్తున్నారు. సుమారు 50 కిలోమీటర్ల దూరం పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వంతెన కూల్చారు.. ప్రత్యామ్నాయం మరిచారు - కృష్ణా జిల్లాలో కూలిన వంతెన
Bridge Collapse: భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి-కూచిపూడి గ్రామాల మధ్య ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరగా అధికారులు కూల్చేశారు. దీంతో కూచిపూడి నుంచి మచిలీపట్నంకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం చూపకుండా వంతెన కూల్చివేయటంపై విద్యార్థులు, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూలిన వంతెన.. నిలిచిన రాకపోకలు
వంతెన కూల్చివేయడంతో విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు వెళ్లేటప్పుడు ఉన్న బ్రిడ్జి.. తిరిగి వచ్చేప్పుడు లేకపోవడంతో విద్యార్థులు..తల్లిదండ్రుల సాయంతో కాలువలో ఇంటికి చేరుకున్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా వంతెన కూల్చివేయటంపై విద్యార్థులు, గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి