కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలోని అముదార్లంక గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారటంతో వాయిదాపడింది. గతంలో పేదలకు పంపిణీ చేసిన నివాస స్థలాలను తీసుకోకుండా ఉండటానికి గ్రామ రెవెన్యూ అధికారి నగదు డిమాండ్ చేశారని, ఆయనకు కొంత నగదు కూడా ఇచ్చినట్లు లబ్ధిదారులు గ్రామ సభలో ఆందోళన చేశారు. అయినప్పటికీ మిగతా డబ్బు ఇవ్వలేదంటూ... తుది జాబితాలో తమ పేర్లు తీసేసారని స్థానిక తహసీల్దార్ ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల పట్టాలు పంపిణీలో లంచాల పర్వం - news updates in krishna district
అది కృష్ణానదికి ఆవల ఉన్న చిన్న గ్రామం. ఆ గ్రామంలో సుమారు 1500 మంది నివసిస్తున్నారు. నవరత్నాలు పథకంలో భాగంగా ఇళ్లపట్టాలు పంపిణీలో అక్రమాలు జరిగాయి. ఒక్కో ఇంటి స్థలానికి రూ.5 వేలు నుంచి రూ.25 వేలు ధర పలికింది. కాగా.. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు తుదిజాబితాలో గల్లంతయ్యాయి. గ్రామసభలో లంచాల విషయం వెలుగులోకి రావడం, గతంలో పట్టాలు ఇచ్చిన ఖాళీ స్థలాలను మరొకరికి కేటాయించడంపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం....
అముదార్లంకలో బాధితుల ఆందోళన
గతంలో పేదలకు ఇచ్చిన నివాస స్థలాలను లాగేసుకోకుండా అందరికీ ఇళ్లు పథకం కోసం భూమిని కొనుగోలు చేసి పేదలకు పంచాలని బాధితులు కోరారు. లంచాలు తీసుకున్న అధికారిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.