వైభవంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్‌బాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 29వ తేదీ రాత్రి 8 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుందని.. 30వ తేదీ రాత్రి 8 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
TAGGED:
mopidevi temple latest news