రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా... అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం సరి కాదని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘాల నాయకులు అమరావతికి ర్యాలీగా తరలి వెళ్తున్నామని చెప్పారు. మంత్రుల వ్యాఖ్యలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు. కొడాలి నాని శాసన రాజధాని కూడా వద్దని చెప్పడంపై రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. అమరావతి కోసం బ్రాహ్మణ సంఘాలు రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు.
రాజధాని రైతులకు బ్రాహ్మణ సంఘాల మద్దతు - అమరావతి రైతులకు బ్రాహ్మణ సంఘాల మద్దతు
ముఖ్యమంత్రి జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి విషయంలో ఒకలా మాట్లాడారని... అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం సరికాదని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద్ సూర్య అన్నారు. మంత్రుల వ్యాఖ్యలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు.
రాజధాని రైతులకు బ్రాహ్మణ సంఘాలు మద్దతు