ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురపాలికలకు పుష్కలంగా ఆదాయం.. బీపీఎస్‌ ఖాతాలో రూ.92 కోట్లు - కృష్ణా జిల్లాలో పురపాలికలకు బీపీఎస్ ఆదాయం

అనధికార భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బిల్డింగ్‌ పీనలైజేషన్‌ పథకం (బీపీఎస్‌) ద్వారా కృష్ణా జిల్లాలోని 2 నగరపాలికలు, 7 పుర పాలికలకు పుష్కలంగా ఆదాయం సమకూరుతోంది. బీపీఎస్‌ కింద కృష్ణా జిల్లాలో మొత్తం 8,311 భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 5,859 దరఖాస్తులను పరిష్కరించారు. ఫలితంగా రూ.92.06 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.

bps revenue to muncipalities in krishna district
పురపాలికలకు పుష్కలంగా ఆదాయం.

By

Published : Aug 10, 2020, 2:06 PM IST

అనధికార భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బిల్డింగ్‌ పీనలైజేషన్‌ పథకం (బీపీఎస్‌) ద్వారా కృష్ణా జిల్లాలోని 2 నగరపాలికలు, 7 పుర పాలికలకు పుష్కలంగా ఆదాయం సమకూరుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసేందుకు 2 నెలల క్రితమే గడువు పూర్తికాగా తాజాగా అపరాధ రుసుమును వసూలు చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. బీపీఎస్‌ కింద జిల్లాలో మొత్తం 8,311 భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 5,859 దరఖాస్తులను పరిష్కరించారు. ఫలితంగా రూ.92.06 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.

  • అత్యధికంగా సీఆర్డీఏ పరిధిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం మించి భవనాల క్రమబద్ధీకరణకు 4,389 దరఖాస్తులు అందగా 2,694 పరిష్కరించారు. ఫలితంగా రూ.43.89 కోట్ల ఆదాయం వచ్చింది.
  • విజయవాడ నగరపాలిక పరిధిలో 300 చదరపు అడుగులలోపు భవనాలను క్రమబద్ధీకరించేందుకు మొత్తం 3,015 దరఖాస్తులు రాగా 2,555 పరిష్కరించటం ద్వారా రూ. 38.71 కోట్ల ఆదాయం సమకూరింది.
  • మచిలీపట్నం నగరపాలికలో 207 దరఖాస్తులకుగాను 171ను పరిష్కరించి రూ. 28.80 కోట్లను అపరాధ రుసుముగా వసూలు చేశారు.

జిల్లాలో మిగిలిన 7 మున్సిపాలిటీలకుగాను నందిగామలో అత్యధికంగా 257 దరఖాస్తులు అందాయి. ఇందులో 65 పరిష్కరించటం ద్వారా రూ.12.6 కోట్ల ఆదాయం వచ్చింది. ఉయ్యూరులో 74కు 55 పరిష్కరించగా రూ.11.20 కోట్లు, తిరువూరులో 30లో 29 పరిష్కారంకాగా రూ. 29 లక్షల ఆదాయం సమకూరింది. గుడివాడలో 136కుగాను 104 దరఖాస్తులు సెటిల్‌కాగా రూ.2.06 కోట్లు, జగ్గయ్యపేటలో 95కు 88 పరిష్కారంకాగా రూ. 77.43 లక్షలు, నూజివీడులో 80కు 71 దరఖాస్తుల ద్వారా రూ.89.01 లక్షలు, పెడనలో 28కు 27 పరిష్కారంకాగా రూ. 15.89 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు చెప్పారు.

  • స్పందించకుంటే చర్యలు

జిల్లాలో ఇంకా 2,452 మంది యజమానులు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుదారులు నిబంధనల ప్రకారం అపరాధ రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకునేందుకు కొంతమంది ముందుకు రావటంలేదని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్ను రెట్టింపు, నీటి పన్ను, విద్యుత్తు ఛార్జీలను 3 రెట్లు పెంచటం, అవసరమైతే 1965 మున్సిపల్‌ చట్టం ప్రకారం భవనాన్ని సీజ్‌ చేయటం వంటి చర్యలు తీసుకుంటామని పెడన టీపీవో ఏసుబాబు చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు జమైన నిధులు ఆ తర్వాత పురపాలికలకు బదిలీ అవుతాయని పేర్కొన్నారు.

  • లేఅవుట్లకు గడువు

అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లేఅవుట్ల యజమానులు తమ పురపాలికల్లో దరఖాస్తు చేయాలని అధికారులు కోరారు.

ఇవీ చదవండి..

కరోనా ప్రభావం.. హోటళ్లే ఆసుపత్రులు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details