నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అంటూ ప్రియురాలి మృతి తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుదురుపల్లిలో చోటుచేసుకుంది. దసరా పండుగ రోజున గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సల్ల మహేశ్ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఇటీవల అమ్మాయి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో మహేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నువ్వే లేని లోకానా... నేనుండలేను - kudurupalli crime news
అమ్మాయిని గాఢంగా ప్రేమించాడో యువకుడు. ఆమె సర్వస్వం అనుకున్నాడు. తనతో జీవితాన్ని ఊహించుకున్నాడు. చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాడు. ఇంతలో విధి కాటేసింది. అనారోగ్యం రూపంలో మృత్యువు యువతిని బలిదీసుకుంది. ప్రేయసి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆ యువకుడి హృదయం ముక్కలైంది.. ఆమె చావుని జీర్ణించుకోలేని ఆ ప్రేమికుడు అర్ధాంతరంగా తనవు చాలించి ప్రియురాలి చెంతకు చేరిన ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.
![నువ్వే లేని లోకానా... నేనుండలేను Young man committed sucide in kudurupalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9305512-236-9305512-1603614495346.jpg)
రోజువారీ విధుల్లో భాగంగా ఇంటి నుంచి వచ్చి అమ్మాయి సమాధి వద్ద చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. బాధితుడి సెల్ఫోన్ స్టేటస్ చూసి స్నేహితులు సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించగా అప్పటికి మృతి చెందాడు. మహేశ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శవ పరీక్ష నిమిత్తం మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి-దసరా హోరు.. వాహన విక్రయాల జోరు