ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మియాపూర్‌లో దాడి ఘటనలో యువతి తల్లి శోభ మృతి - మియాపూర్​ ఘటన తల్లి మృతి

Miyapur Incident Updates : మంగళవారం హైదరాబాద్​లోని మియాపూర్​లో గుంటూరులో తల్లీకుమార్తెలపై కత్తితో దాడి ఘటనలో.. బుధవారం తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది.

Miyapur Incident Updates
మియాపూర్‌లో దాడి

By

Published : Dec 14, 2022, 11:24 AM IST

Miyapur Incident Updates: హైదరాబాద్​లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడి ఘటనలో గాయపడ్డ యువతి తల్లి శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న తల్లి, కుమార్తెపై నిందితుడు సందీప్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యుల వెల్లడించారు.

అసలేం జరిగిదంటే:ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువతి, ఆమె తల్లి.. సోదరుడితో కలిసి 8నెలల కిందట హైదరాబాద్‌కు వలస వచ్చారు. గుంటూరులో ఉంటున్న సమయంలో యువతికి రేపల్లెకు చెందిన సందీప్‌తో పరిచయం ఏర్పడింది. మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి నిశ్చితార్ధం కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. మనస్పర్థలు రావడంతో కొద్దికాలంగా యువతి.. సందీప్‌ను దూరం పెడుతూ వచ్చింది. అతనితో మాట్లాడడం మానేసింది.

సందీప్‌ తరచూ యువతికి ఫోన్‌ చేయడంతోపాటు.. వాట్సాప్‌ సందేశాలు పంపుతూ బెదిరించేవాడని పోలీసులు తెలిపారు. రేపల్లె నుంచి మియాపూర్‌కు వచ్చిన సందీప్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లితో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. సందీప్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఇదే క్రమంలో అడ్డువచ్చిన యువతిపైనా దాడి చేసి.. అనంతరం కత్తితో గొంతు కోసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details