విజయవాడలో కలకలం రేపిన బాలుడు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. బాలుడిని నగరానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సత్యనారాయణపురం పోలిస్టేషన్ పరిధిలోని మధురానగర్‌కు చెందిన బాలుడు ఉదయం పాల ప్యాకెట్ తెస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాకపోవటం వల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు బాలుడు తండ్రి కులశేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడు హైదరాబాద్‌లోని ఓ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలుడిని విజయవాడకు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
పాల ప్యాకెట్ కోసం వెళ్లి అదృశ్యమైన బాలుడు ఆచూకీ లభ్యం - విజయవాడ తాజా క్రైమ్ వార్తలు
పాల ప్యాకెట్ తెస్తానని బయటకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడం విజయవాడలో కలకలం రేపింది. అయితే బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని నగరానికి తీసుకొచ్చిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
అదృశ్యమైన బాలుడు
అయితే బాలుడు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు.. ఎలా వెళ్లాడు. ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా..? లేక బాలుడే వెళ్లాడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉండగా.. బాలుడు నగరానికి వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి"
'ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు'
Last Updated : Nov 18, 2020, 5:17 PM IST