విజయవాడలోని నేతాజీ కాలనీలో విషాదం జరిగింది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి వెంకటరావు.. ఏడాదిన్నర కుమారుడు రుత్విక్ ఆడుకుంటూ.. వెళ్లి గృహానికి సమీపంలోని డ్రైనేజ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఎవరు గమనించకపోవటంతో బాలుడు డ్రైనేజి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి - విజయవాడ వార్తలు
ఏడాదిన్నర బాలుడు డ్రైనేజిలో పడి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి boy died falling into drainage in krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10605128-439-10605128-1613158757842.jpg)
డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి
బాలుడు కనింపించక పోవటంతో తల్లిదండ్రులు చట్టుప్రక్కల వెతకగా... బాలుడు డ్రైనేజీలో విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి