ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Botsa: 'నిర్దేశించిన సమయానికే.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి'

రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను వచ్చే నెలలో లబ్దిదారులకు అందించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టిడ్కో, బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, నిర్దేశించిన సమయానికి ఇళ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Botsa on Tidco homes
టిడ్కో, బ్యాంకు అధికారులతో మంత్రి బొత్స సమీక్ష ...

By

Published : Jul 28, 2021, 1:45 PM IST

టిడ్కో ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లను వచ్చే నెలలో లబ్దిదారులకు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి తెలిపారు. నిర్దేశించిన సమయానికి ఇళ్ల నిర్మాణ పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అన్ని కాలనీల్లో నిర్మాణపు పనులతో పాటు, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఇళ్లకు సంబంధించి అగ్రిమెంటు కుదుర్చుకున్న లబ్దిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా అధికారులు సహకరించాలని..బ్యాంకుల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో 2.92 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రస్తుతం కోనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details