అమ్మ ఒడిలో వెచ్చగా సేద తీరాల్సిన శిశువును రోడ్డు పక్కన పడేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ సమీపంలో అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో వదిలివెళ్లారు. ప్రభుత్వ శిశు గృహానికి చెందిన సిబ్బంది శిశువును గమనించి ఆస్పత్రికి తరలించి..ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.
మచిలీపట్నంలో దారుణం...పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు - born baby
మానవత్వం మంటగలిసింది. మాతృ ప్రేమ బండరాయిలా మారింది. కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించింది. అప్పుడే పుట్టిన బిడ్డను రోడ్డు పక్కన పొదల్లో పడేసిన ఘటన మచిలీపట్నంలో జరిగింది.
మచిలీపట్నంలో ఘోరం... రోడ్డు పక్కన పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు