ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనవరి 3 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం - vijayawada book festival news

విజయవాడలో పుస్తక మహోత్సవాలు జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నారు.

book festival is going to start at vijayawada from january third
జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న విజయవాడ పుస్తక మహోత్సవం

By

Published : Jan 2, 2020, 2:21 PM IST

జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న విజయవాడ పుస్తక మహోత్సవం

విజయవాడ స్వరాజ్ మైదాన్​ వేదికగా.. పుస్తక మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (జనవరి 3) 12 వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన, విక్రయాలు జరగనున్నాయి. ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పుస్తక మహోత్సవాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని... విజయవాడ బుక్ ఫెస్టవల్ సొసైటీ అధ్యక్షులు కె. లక్ష్మయ్య, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్ తెలిపారు. మహోత్సవాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 200లకు పైగా దుకాణాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. 10 రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో... ప్రతి రోజు ప్రముఖల జీవితంపై పుస్తకాల ప్రభావాన్ని పంచుకునేందుకు వారితో పాత్రికేయులకు ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్లాస్టిక్ నిషేధం

స్వచ్ఛ భారత్ లో భాగంగా పూర్తిగా ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకుని మహాత్ముడు రచించిన పుస్తకాలను , జాతిపితపై రాసిన పుస్తకాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తక మహోత్సవాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఇదీ చదవండి: 'సానుకూల నిర్ణయం వచ్చే వరకూ పోరాడతాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details