రాజధాని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన పోలీసుల్ని సస్పెండ్ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్ ఆదేశాలతోనే, పోలీసులు... రాజధాని మహిళలపై దుశ్శాసన పర్వానికి తెగబడ్డారని ఆరోపించారు. ఏనేరం చేయకుండానే వారిపై దుర్మార్గంగా ప్రవర్తించి తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా దినోత్సవం రోజే పోలీసులు బూటుకాళ్లతో వారిని తన్నితే మహిళా కమిషన్... జగన్కు భజన చేస్తోందా అని నిలదీశారు. తక్షణమే నమోదు చేసిన తప్పుడు కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాజధాని మహిళల పట్ల పోలీసుల తీరు అమానుషం: బొండా ఉమా - తెదేపా నేత బొండా ఉమా
మహిళ దినోత్సవం రోజున రాజధాని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమమహేశ్వరరావు డిమాండ్ చేశారు.
బొండా ఉమా
మూడు రాజధానుల ముచ్చటలో ఇక మిగిలింది కర్నూలేనని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేసారు. జగన్ చూపు పడితే ఆ నగరం సంగతి కూడా అంతేనని విమర్శించారు. కేసుల నుంచి బయటపడేందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ బేరం పెట్టారని ఆరోపించారు.
ఇదీ చదవండి:విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం