ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైకాపా: బోండా ఉమా - ఐటీ రైడ్స్​పై బోండా ఉమా

ఐటీ సోదాలపై వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై తెదేపా నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఇన్​కమ్​ ట్యాక్స్ అంటే అర్ధం తెలుసా అని ప్రశ్నించారు.

bonda uma on it raids
ఐటీ సోదాలపై స్పందించిన బోండా ఉమా
author img

By

Published : Feb 14, 2020, 3:18 PM IST

ఐటీ సోదాలపై స్పందించిన బోండా ఉమా

దేశవ్యాప్తంగా ఐటీ తనిఖీలు జరుగుతుంటే వైకాపా ప్రభుత్వం తెదేపాకి అంటకడుతుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగినప్పుడు ఆయన ఇంట్లో 70 లేదా 80 వేల నగదు మాత్రమే దొరికితే... 2000 వేల కోట్ల రూపాయలు దొరికాయని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఇన్​కమ్​ ట్యాక్స్ అంటే అర్ధం తెలుసా అని ప్రశ్నించారు. ఐటీ తనిఖీలకు తెదేపాకి సంబంధం లేదని బోండా ఉమా స్పష్టం చేశారు. రెండు లక్షల కోట్లు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఆరోపించారనీ, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా... 9 రూపాయల అవినీతి అయినా నిరూపించగలిగారా అని నిలదీశారు. అవినీతి మరకలను తెదేపా, చంద్రబాబుకు అంటించాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. అవినీతి పునాదులపై పుట్టింది వైకాపా పార్టీ అని బోండా ఉమా విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details