ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల పేరిట వైకాపా నాయకులు దోచుకున్నారు: బొండా ఉమ - వైకాపా ప్రభుత్వంపై బొండా ఉమా

మద్యం, ఇసుక, మైన్స్ మాఫియాలతో తిన్నది చాలక ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేతలు సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని బొండా ఉమ ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరిట వైకాపా కార్యకర్తల నుంచి మంత్రుల వరకు కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు.

bonda uma fires on ysrcp rule
వైకాపా పాలనపై బొండా ఉమా

By

Published : Aug 24, 2020, 3:08 PM IST

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట వైకాపా నాయకులు విచ్చలవిడిగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రైవేటు స్థలాలను ప్రభుత్వానికి విక్రయించి అధికార పార్టీ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు కోట్లు కొల్లగొట్టారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆ అంశంపై కోర్టుల్లో కేసులు ఉంటే.. ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ పంపిణీని వాయిదా వేస్తున్నారని విమర్శించారు.

మద్యం, ఇసుక, మైన్స్ మాఫియాలతో తిన్నది చాలక ఇళ్లస్థలాల పేరుతో వైకాపా నేతలు సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని బొండా ఉమ ధ్వజమెత్తారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని బొండా ఉమ ప్రశ్నించారు.

బొండా ఉమ

ఇదీ చదవండి :'వాళ్లు' ఇంట్లోనే ఉంటున్నారు.. మరి చికిత్స సంగతి?

ABOUT THE AUTHOR

...view details