ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bonda Fire On YSRCP: వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి: బొండా ఉమ - Bonda Uma Fire

Bonda Uma Fire On Jagan Govt: రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆరోపించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు సూచించారు.

వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

By

Published : Feb 1, 2022, 4:25 PM IST

Bonda Uma Fire On YSRCP Govt: వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని టీఎన్​ఎస్​ఎఫ్ నేతలకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్​క్లబ్​లో జరిగిన టీఎన్​ఎస్​ఎఫ్ సెంట్రల్ నియోజకవర్గ కమిటీ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ, జనరల్​ సెక్రటరీగా నియమితులైన మనోజ్ కుమార్, అరవింద్ సింగ్​లతో బొండా ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని బొండా ఉమ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో విదేశాల్లో చదువుతోన్న విద్యార్థులకు రూ.25 లక్షల వరకూ ఆర్థిక సాయం చేసేవారని, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశాల్లో చదువుతోన్న ఆ వర్గ విద్యార్థులకు ఆర్థిక సాయమందించేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటివేమీ లేవని ఆక్షేపించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎన్నో పథకాలను జగన్ నిలిపేశారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో సరైన జాబ్ నోటిఫికేషన్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసపూరిత ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

Lokesh: సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే చేనేతల ఆత్మహత్యలు: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details