వైకాపా నేతల మద్దతుతోనే హెరాయిన్ నిందితుడు సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం చేశాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. జగన్ హయాంలో పది తరాలకు సరిపడా వైకాపా నేతలు సంపాదించారని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. "రాష్ట్రాన్ని వైకాపా నేరాంధ్రప్రదేశ్‌గా మార్చిందని... దేశంలో ఏ స్కాం బయటపడినా మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయని విమర్శించారు. రూ.9 వేల కోట్లు హెరాయిన్ మూలాలపై వైకాపా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని వైకాపా నేతలు ఇప్పటికే విదేశాల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారి తలనీలాలను విదేశాలకు ఎగుమతి చేస్తూ దొరికిపోయారని..మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యేక విమానాల్లో విదేశాలకు డబ్బు తరలిస్తున్నారని బోండా ఉమ విమర్శించారు.
Bonda Uma : వైకాపా నేతల మద్దతుతోనే సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం: బోండా ఉమా - సుధాకర్ డ్రగ్స్ వ్యాపారంపై బోండా ఉమ వ్యాఖ్యలు
జగన్ హయాంలో పది తరాలకు సరిపడా వైకాపా నేతలు సంపాదించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ దుయ్యబట్టారు. వైకాపా నేతల మద్దతుతోనే హెరాయిన్ నిందితుడు సుధాకర్ డ్రగ్స్ వ్యాపారం చేశాడని ఆరోపించారు.
బోండా ఉమా