ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తమిళనాడులో పట్టుబడిన డబ్బు మంత్రి బాలినేనిదే' - మంత్రి బాలినేనిపై బొండా ఉమా

తమిళనాడులో పట్టుబడిన డబ్బు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. మంత్రి బాలినేనిని బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

bonda uma on balineni srinivas
మంత్రి బాలినేనిపై బొండా ఉమా వ్యాఖ్యలు

By

Published : Jul 16, 2020, 3:11 PM IST

తమిళనాడులో పట్టుబడిన డబ్బు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదే అని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి బాలినేనిని తక్షణం బర్తరఫ్ చేయాలన్నారు. వైకాపా నేతల డబ్బు ఒక్క రోజులో రూ.5 కోట్లు దొరికిందన్నారు. ఈ డబ్బు, బంగారం... వ్యాపారిదని చెబుతూ మభ్యపెడుతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details