ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో బొల్లిముంత శివరామకృష్ణయ్య శత జయంతి సభ - Bollimuntha Sivaramakrishnaiah news

అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య శత జయంతి సభను మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. విజయవాడలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

shatha Jayanti Sabha
శివరామకృష్ణయ్య శత జయంతి సభలో పుస్తక ఆవిష్కరణ

By

Published : Nov 28, 2020, 2:31 PM IST

పుస్తక రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య శతజయంతి సభ విజయవాడలో జరిగింది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజేంద్రప్రసాద్, విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు వీరభద్రుడు పాల్గొన్నారు. శివరామకృష్ణయ్య రచించిన పిల్లల కథలు, నాటకాలు - నాటికలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు.

మహనీయుడైన బొల్లిముంత రచనలు ఆవిష్కరించడం తన అదృష్టమని వీరభద్రుడు అన్నారు. పాఠశాల విద్యా శాఖ తరపున బాల సాహిత్యంపై దృష్టి పెట్టామని చెప్పారు. జాషువా రూపకల్పన చేసిన ఒకటవ తరగతి పుస్తకాలు తాను చదువుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. బాల సాహిత్యం పాఠ్య పుస్తకాలుగా అందించడంలో బొల్లిముంత శివరామకృష్ణయ్య ఎంతో కృషి చేశారన్నారు.

ఇదీ చదవండి: తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details