ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్సీగా మరోసారి గెలిపించండి: బొడ్డు నాగేశ్వరరావు - today boddu Nageswararao press meet news update

మార్చి 14న జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తనను గెలిపించాలని బొడ్డు నాగేశ్వరరావు విజయవాడలో కోరారు. విలువలు పాటిస్తూ శాసన మండలిలో సమస్యలపై పోరాడుతూ అనేకమంది ఆదరాభిమానాలు పొందిన తనను మరోసారి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

boddu Nageswararao
బొడ్డు నాగేశ్వరరావు మీడియా సమావేశం

By

Published : Mar 12, 2021, 9:08 AM IST

ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు బొడ్డు నాగేశ్వరరావు విజయవాడలో తెలిపారు. మార్చి 14న జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని.. విద్యారంగంలో ఎయిడెడ్ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయని నాగేశ్వరరావు అన్నారు. సీపీఎస్ రద్దు వంటి అనేక సమస్యలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో పరిష్కారానికై కృషి చేశామన్నారు. విలువలు పాటిస్తూ శాసన మండలిలో సమస్యలపై పోరాడుతూ అనేకమంది ఆదరాభిమానాలు పొందిన తనను మరోసారి గెలిపించాల్సిందిగా కోరారు.

ABOUT THE AUTHOR

...view details