ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటికి చేరిన అబ్దుల్ సలీమ్ మృతదేహం - godavari river

గోదావరి నదిలో పాపికొండలు విహార యాత్ర పడవ ప్రమాదంలో మృతి చెందిన అబ్దుల్ సలీమ్ మృతదేహం స్వగృహానికి తరలించారు.

బోటు ప్రమాదం

By

Published : Sep 18, 2019, 12:04 AM IST

ఇంటికి చేరిన అబ్దుల్ సలీమ్ మృతదేహం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరులోని సలీమ్ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. సలీమ్ భౌతికకాయాన్ని చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా సమన్వకర్త యార్లగడ్డ వెంకట్రావు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబీకులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రకటించిన 10లక్షల పరిహారం సత్వరమే అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం రెవెన్యూ అధికారులు 5 వేల రూపాయలను మృతుని కుటుంబానికి అందచేశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిహారం త్వరగా అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details