ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో రాయల్ యూత్ ఫెడరేషన్, ప్రగతి పదం యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 40 మంది యువత రక్తదానం చేశారని వారికి సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి యువత రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. బ్లడ్ డొనేట్ చేస్తున్నవారికి సర్టిఫికెట్స్ అందజేశారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
విజయనగరంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. బ్లడ్ డొనేట్ చేయటానికి ప్రతీఒక్కరూ ముందుకు రావాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ కేఆర్‌డీ ప్రసాదరావు కోరారు. ఆరోగ్యవంతులైన వారు ప్రతీ మూడు నెలలకూ ఒకసారి రక్తదానం చేయవచ్చునని సూచించారు. రక్తదానంపై అపోహలను విడనాడాలని, ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, రక్త దాతలుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.