ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మా ఊర్లోకి రావొద్దు బాబోయ్​..!

By

Published : Mar 26, 2020, 9:49 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో.. రాష్ట్రంలో రాకపోకలు నిలిపివేసేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ఆకతాయిలు ఏమాత్రం లెక్కచెయ్యకుండా బయట తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​ డౌన్​ కార్యక్రమం పట్ల కాస్తంత జాగ్రత్త కూడా తీసుకోవడం లేదు. కానీ.. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని గ్రామాల ప్రజలు మాత్రం ప్రభుత్వం చేసే సూచనలను పాటిస్తున్నారు. ఇతరులను తమ ఊర్లోకి రాకుండా... గ్రామస్థులు బయటకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేస్తున్నారు. మా ఊర్లోకి రావోద్దు బాబోయ్​ అంటూ కాపలా కాస్తున్నారు.

కృష్ణా జిల్లాలో పలు గ్రామాలకు అష్ట దిగ్బంధనం
కృష్ణా జిల్లాలో పలు గ్రామాలకు అష్ట దిగ్బంధనం

కృష్ణా జిల్లాలో పలు గ్రామాలకు అష్ట దిగ్బంధనం

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా తమ ఊరి రహదారులను మూసివేస్తున్నారు. రామన్నపాలెం గ్రామంలో ఇతరులకు ప్రవేశం లేకుండా రహదారికి అడ్డుగా ముళ్ల కంచె వేసి రాకపోకలు నిలిపివేశారు. ముష్టికుంట్ల గ్రామ వాలంటీర్లు కంచె ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. ఆంజనేయపురంలో రహదారిపై ముళ్ల కంచె వేసి గ్రామ యువత రాకపోకలు నిలిపివేశారు. మునుకుళ్ల శివారులో గ్రామస్థులు రోడ్లు దిగ్బంధం చేశారు. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోకి ఇతర గ్రామాల నుంచి వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు మట్టి పోసి రహదారిని మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details