ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో రెచ్చిపోయిన బ్లేడు బ్యాచ్.. యువకుడి ఛాతీపై గాయం - పాతపాడు బ్లేడ్ బ్యాచ్ న్యూస్

కారుకు అడ్డంగా ద్విచక్ర వాహనం వచ్చింది... చూసి బండి నడపండి అని కారులో ఉన్న యువకుడు చెప్పాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడికి ఆ మాట రుచించలేదు. గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ద్విచక్ర వాహనం నడపిన యువకుడు... కారు నడుపిన యువకుడిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పాతపాడులో జరిగింది.

blade batch attack
బ్లేడు బ్యాచ్ దాడి

By

Published : Jan 4, 2021, 9:42 AM IST

Updated : Jan 4, 2021, 11:51 AM IST

ఓ యువకుడిని మరో యువకుడు బ్లేడుతో ఛాతిపై దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా పాతపాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పామర్తి భార్గవ కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నాం తన పెద్దమ్మ కుమారుడు బెజవాడ సాయి, అతడి స్నేహితులు హర్ష, విజయ్​తో కలిసి కారులో పాతపాడు నుంచి విజయవాడకు బయల్దేరారు. వారు వెళ్తున్న కారుకు అడ్డంగా ద్విచక్రవాహనంపై మహ్మద్, రజాక్, లోకేష్ అనే యువకులు వచ్చారు. ప్రమాదం జరుగుతుందని గ్రహించిన కారులో ఉన్న సాయి... వాళ్లను వారించాడు.

చూసి నడపండని సాయి చెప్పిన మాటలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురికి నచ్చలేదు. అంతే సాయితో ఆ యువకులు గొడవపడ్డారు. చుట్టుపక్కలవారు అక్కడకు చేరి.. వారిని సముదాయించి అక్కడి నుంచి పంపేశారు.

జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న మహ్మద్, రజాక్, లోకేశ్​.. తమ స్నేహితులైన రాజ్​కుమార్, ఇబ్రహీం, అబ్బాస్, ఈశ్వర్​కుమార్​ను పిలిపించారు. పాతపాడు సెంటరుకు వచ్చి సాయి, హర్షతో మళ్లీ గొడవకు దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదైంది. ఆగ్రహంతో ఊగిపోయిన రజాక్​... భార్గవ్​ ఛాతిపై కోశాడు.

ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. మద్యం మత్తులోనే రజాక్, అతని స్నేహితులు గొడవ పడినట్లు తెలుస్తోంది. రజాక్ సింగ్​నగర్ ప్రాంతానికి చెందిన వాడనీ... అతనికి గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం

Last Updated : Jan 4, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details